ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన సూట్ కేసులో అమ్మాయి శవం కేసు మిస్టరీ వీడింది. కన్నతండ్రే ఆ అమ్మాయిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద ఒక ఎరుపు రంగు సూట్ కేసు పై రక్తం మరకలు కనిపించడంతో కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన పోలీసులు సూట్‌కేసును తెరువగా అందులో అమ్మాయి శవం కనిపించింది. మృతిరాలి శరీరంపై పలు గాయాలు కూడా ఉన్నాయి. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని ఆయుషి యాదవ్(21)గా గుర్తించారు.
ఆయుషి తన తల్లిదండ్రులకు చెప్పకుండా మరో సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆయుషి తండ్రీ నితీష్ యాదవ్ తన పరువు పోయిందని బావించాడు. తన వద్ద ఉన్న లెసెన్స్‌డ్ తుపాకీతో ఆయుషిని కాల్చి చంపాడు. అనంతరం మృతదేహం కాళ్లూ, చేతులను మడిచి ట్రాలీ బ్యాగులో కుక్కాడు. తరువాత కారులో ఢిల్లీ నుంచి మథురకు తీసుకువచ్చి రోడ్డుపై పడేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు అతడి భార్య సహకరించింది. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి లైసెన్స్ డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.