మహిళపై పరిచయస్తుడు అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి

ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. జ్యోతిష్యం చెప్పే మహిళపై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి
Published on : 19 March 2024 11:42 AM IST

Delhi, tarot reader, astrology, Crime news

మహిళపై పరిచయస్తుడు అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి

ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. జ్యోతిష్యం చెప్పే మహిళపై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తన ఆస్తిని విక్రయించడానికి సహాయం కోరుతూ జనవరిలో ఓ వ్యక్తిని సంప్రదించింది. ఆ తర్వాత అతను ఆమె నుండి జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నాడనే సాకుతో దగ్గరయ్యాడు. దీంతో వారి పరిచయం స్నేహంగా మారింది.

40 ఏళ్ల గౌరవ్ అగర్వాల్‌గా గుర్తించిన నిందితుడిని జనవరిలో ఆస్తి విక్రయానికి సంబంధించి సంప్రదించినట్లు 36 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 11 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగర్వాల్ తన నివాసాన్ని సందర్శించి, ఆస్తి అమ్మకానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. తనకు జ్యోతిష్యం ఉందని తెలియగానే, తనకు కూడా ఆసక్తి ఉన్నట్లు నటించి, తన నుంచి నేర్చుకోవాలనే సాకుతో ఫోన్ చేయడం ప్రారంభించాడని ఆ మహిళ తెలిపింది.

జనవరి 24న, ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఆ వ్యక్తి ఆమెను నెబ్ సరాయ్‌లోని స్నేహితురాలి ఇంటికి పిలిచాడు. మత్తు మందు కలిపిన పానీయం తాగి స్పృహతప్పి పడిపోయానని, ఆ సమయంలో అతను తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తిపై ఐపీసీ సెక్షన్‌ 328/376/506 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ఫిబ్రవరి 10 న జరిగిన సంఘటన గురించి మహిళ తన భర్తకు చెప్పింది. వారిద్దరూ మాల్వియా నగర్‌లోని అతని కార్యాలయంలో అగర్వాల్‌ను ఎదుర్కోవడానికి వెళ్ళారని PTI వార్తా సంస్థ నివేదించింది. కానీ అతను ఎటువంటి తప్పు చేయలేదని నిరాకరించాడు. మాటలతో దుర్భాషలాడాడు. జంటను బెదిరించాడు. నిందితుడిని పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నారు.

Next Story