దారుణం.. కారుతో ఢీకొట్టి.. కానిస్టేబుల్‌ని చంపాడు

దేశరాజధాని ఢిల్లీలో ఓ మద్యం సరఫరాదారుడు తన కారుతో హల్‌చల్‌ చేశాడు. నగరంలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఆదివారం నాడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను మద్యం సరఫరాదారు కారుతో ఢీకొట్టి చంపాడు.

By అంజి
Published on : 29 Sept 2024 10:15 AM IST

Delhi, Police constable, crush, liquor supplier, Crime

దారుణం.. కారుతో ఢీకొట్టి.. కానిస్టేబుల్‌ని చంపాడు

దేశరాజధాని ఢిల్లీలో ఓ మద్యం సరఫరాదారుడు తన కారుతో హల్‌చల్‌ చేశాడు. నగరంలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఆదివారం నాడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను మద్యం సరఫరాదారు కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నప్పటికీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్‌కు మద్యం సరఫరాదారు కారు వస్తున్నట్లు సమాచారం అందింది. అతను కారు ఆపమని సిగ్నల్ ఇచ్చినా, డ్రైవర్ పాటించకపోవడంతో కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు.

మరో కారు ఢీకొనడంతో కానిస్టేబుల్‌ను సుమారు 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. కారును స్వాధీనం చేసుకున్నా మద్యం లభించలేదు.

Next Story