గెస్ట్ హౌస్‌లో ఉరి వేసుకున్న నర్సు
గెస్ట్ హౌస్‌లోని ఓ గదిలో 32 ఏళ్ల నర్సు ఉరి వేసుకుని కనిపించింది. ఆదివారం ఆగ్రాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 6 Feb 2024 7:27 AM ISTగెస్ట్ హౌస్‌లో ఉరి వేసుకున్న నర్సు
గెస్ట్ హౌస్‌లోని ఓ గదిలో 32 ఏళ్ల నర్సు ఉరి వేసుకుని కనిపించింది. ఆదివారం ఆగ్రాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ కుసుమ్ కుమారి అనే మహిళ ఆగ్రాకు చెందినది అయితే ఢిల్లీలో నర్సుగా పనిచేస్తోంది. న్యూ ఆగ్రా ఏసీపీ ఆదిత్య సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుసుమ్ కుమారి ఆగ్రాలోని తన తల్లిదండ్రులను కలవడానికి వచ్చింది. వారిని కలిసిన తరువాత , ఆమె ఎక్కడికి వెళుతున్నానన్న విషయం ఎవరికీ తెలియజేయకుండా ఇంటి నుండి బయలుదేరింది.
కొన్ని గంటల తర్వాత, ఆమె కమ్లా నగర్ ప్రాంతంలో ఉన్న తోరన్ గెస్ట్ హౌస్‌లోని ఒక గదిలో శవమై కనిపించింది. ఓ మహిళ తన రైలు ఆలస్యమైనందున కొన్ని గంటలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి కొన్ని గంటలపాటు గదిని బుక్ చేసిందని గెస్ట్ హౌస్ సిబ్బంది నుండి పోలీసులకు సమాచారం అందిందని సింగ్ చెప్పారు. అయితే, ఆమె చెక్ అవుట్ సమయం దాటి చాలా గంటలు గడిచినా ఆమె తన గది నుండి బయటకు రాకపోవడంతో, గెస్ట్ హౌస్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఆ తర్వాత గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు కుసుమ ఉరివేసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె మృతి గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించగా, ఆమె గెస్ట్ హౌస్‌లో ఎవరైనా కలిశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుసుమ్ భర్త గబ్బర్ ఢిల్లీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, అతను తన వెంట రాకపోవడంతో ఆమె ఒంటరిగా ఆగ్రాకు వచ్చిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం, పోలీసులు కేసును ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు, అయితే గెస్ట్ హౌస్‌లోని సిసి కెమెరాలను తనిఖీ చేస్తున్నారు.