అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. పిల్లలను ఢీకొట్టి.. ఆపై..

Delhi Man Loses Control Of Car, Runs Over 3 Children Standing On Footpath. ఉత్తర ఢిల్లీలోని గులాబీ బాగ్‌లోని లీలావతి పాఠశాల సమీపంలోని ఫుట్‌పాత్‌పైకి కారు దూసుకెళ్లింది.

By M.S.R
Published on : 18 Dec 2022 7:42 PM IST

అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. పిల్లలను ఢీకొట్టి.. ఆపై..

ఉత్తర ఢిల్లీలోని గులాబీ బాగ్‌లోని లీలావతి పాఠశాల సమీపంలోని ఫుట్‌పాత్‌పైకి కారు దూసుకెళ్లింది. 30 ఏళ్ల వ్యక్తి తన మారుతీ బ్రెజా కారుతో ముగ్గురు పిల్లలను ఢీకొట్టాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్‌లో కారు అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి, పిల్లలను ఢీకొట్టి, వెంటనే ఆగిపోయింది. అక్కడే ఉన్న వ్యక్తులు పిల్లలకు సహాయం చేయడానికి పరుగెత్తారు. కొందరు డ్రైవర్‌ను పట్టుకుని కొట్టడం కనిపించింది. కారులో ఉన్నవారు పారిపోయేందుకు ప్రయత్నించారని, అయితే వారి టైరు పగిలి కారు ఒక్కసారిగా ఆగిపోయిందని స్థానికులు ఆరోపించారు. స్థానికులు ఇద్దరినీ ఓ గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు.

ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో స్థానికులు ప్రతాప్ నగర్ నివాసి గజేందర్‌ పట్టుకున్నారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10, 4, 6 సంవత్సరాల వయస్సు పిల్లలు గాయపడ్డారు. సీసీటీవీ వీడియోలో ఓవర్ స్పీడ్ లో వచ్చిన కారు ఫుట్ పాత్ మీదకు దూసుకుని వెళ్ళింది. స్థానికులు వెంటనే సహాయం చేయడానికి పరిగెత్తారు. ఆగ్రహించిన స్థానికులు కారును ధ్వంసం చేశారు. కారును పోలీసులు సీజ్ చేశారు.


Next Story