6వ తరగతి విద్యార్థినిపై ల్యాబ్‌ టెక్నీషియన్‌ లైంగిక వేధింపులు

Delhi Bhajanpura Private School lab technician assaulted class 6 girl many times from november. పిల్లలకు పాఠశాలలు ఎంతవ‌ర‌కూ సురక్షితం అనే ప్రశ్నను మరోసారి లేవనెత్తింది ఈ ఘ‌ట‌న‌.

By Medi Samrat
Published on : 29 April 2023 11:08 AM IST

6వ తరగతి విద్యార్థినిపై ల్యాబ్‌ టెక్నీషియన్‌ లైంగిక వేధింపులు

పిల్లలకు పాఠశాలలు ఎంతవ‌ర‌కూ సురక్షితం అనే ప్రశ్నను మరోసారి లేవనెత్తింది ఈ ఘ‌ట‌న‌. ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో జ‌రిగిన ఈ ఘటన.. పిల్ల‌ల‌కు పాఠ‌శాలలు కూడా సుర‌క్షిత ప్ర‌దేశాలు కావ‌నే సందేహాన్ని క‌లిగిస్తుంది. భజన్‌పురా ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై గతేడాది నవంబర్‌ నుంచి స్కూల్‌కు చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థిని చాలా రోజులుగా మనస్తాపానికి గురవడం చూసి.. తల్లి ఒత్తిడి తెచ్చి కారణం అడిగింది. దీంతో బాలిక తల్లికి విషయం చెప్పింది. బిడ్డ మాటలు విని తల్లి ఆవేదనతో ర‌గిలిపోయింది. శుక్రవారం బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు భజన్‌పురా పోలీస్ స్టేషన్ లో ఫోక్సో యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story