11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర గులాబీలు అమ్ముకుంటుండగా కిడ్నాప్‌ చేసి..

సెంట్రల్ ఢిల్లీలోని ప్రసాద్ నగర్ ప్రాంతంలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గులాబీలు అమ్ముకునే 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి..

By -  అంజి
Published on : 23 Jan 2026 2:30 PM IST

Delhi, Crime, selling roses, traffic signal, kidnap, auto driver

11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర గులాబీలు అమ్ముకుంటుండగా కిడ్నాప్‌ చేసి..

సెంట్రల్ ఢిల్లీలోని ప్రసాద్ నగర్ ప్రాంతంలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గులాబీలు అమ్ముకునే 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అడవికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడో వ్యక్తి. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు వేగంగా వ్యవహరించి, దాదాపు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, నిందితుడైన ఈ-రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

ఈ దారుణ సంఘటన జనవరి 11న జరిగింది. బాధితురాలు ప్రసాద్ నగర్ ప్రాంతంలోని ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద గులాబీలు అమ్ముతోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 40 ఏళ్ల వయసున్న నిందితుడు దుర్గేష్ ప్రయాణికులను దింపి తన ఇ-రిక్షాను ఆ అమ్మాయి దగ్గర ఆపాడు. పూలు అమ్మడానికి అమ్మాయి అతని దగ్గరికి వచ్చినప్పుడు, నిందితుడు తన గులాబీలన్నింటినీ అమ్మేస్తానని హామీ ఇచ్చి ఆమెను మోసం చేశాడు. ఆ యువతి అతని మాటలకు లొంగిపోయి రిక్షాలో ఎక్కింది.

వార్తా సంస్థ PTI ప్రకారం, నిందితుడు బాలికను ప్రొఫెసర్ రామ్‌నాథ్ విజ్ మార్గ్ సమీపంలోని ఏకాంత అడవికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. సంఘటన తర్వాత, బాలిక స్పృహ తప్పి పడి పోయింది. ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె చనిపోయిందని భావించి నిందితుడు అక్కడి నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు. స్పృహ వచ్చిన తర్వాత, బాలిక తన ఇంటికి చేరుకోగలిగింది, ఆ తర్వాత ఆమె కుటుంబం ఆమెను ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

దర్యాప్తు ప్రారంభంలో.. ఆ బాలిక షాక్‌కు గురైంది, ఇది సంఘటనలను సేకరించడంలో పోలీసులకు గణనీయమైన సవాలుగా మారింది. బాలిక అదృశ్యం నుండి అడవికి దాదాపు 15 మార్గాల్లో ఏర్పాటు చేసిన 300 సిసిటివి కెమెరాల ఫుటేజీలను పోలీసులు విశ్లేషించారు. ఒక ఫుటేజ్‌లో, బాలిక ఇ-రిక్షా ఎక్కుతున్నట్లు కనిపించింది. రిక్షా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి, పోలీసులు నిందితుడు దుర్గేష్‌ను ట్రాక్ చేసి, అదే రోజు అతన్ని అరెస్టు చేశారు.

విచారణలో, నిందితుడు కొంతకాలంగా సిగ్నల్ వద్ద బాలికను గమనిస్తున్నానని, ఆమెను కిడ్నాప్ చేయాలని ఇప్పటికే ప్లాన్ చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి సమాచారం ఆధారంగా పోలీసులు రక్తపు మరకలున్న దుస్తులు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స మరియు కౌన్సెలింగ్ పొందుతోంది. ఈ విషయంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Next Story