విశాఖలో దారుణం.. డ్రమ్ములో కుళ్లిపోయిన మహిళ శరీర భాగాలు లభ్యం

Decomposed parts of woman’s body found in drum in Visakhapatnam. హత్యల తర్వాత శరీర భాగాలను పారవేసే కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోంది.

By అంజి  Published on  5 Dec 2022 2:30 PM IST
విశాఖలో దారుణం.. డ్రమ్ములో కుళ్లిపోయిన మహిళ శరీర భాగాలు లభ్యం

హత్యల తర్వాత శరీర భాగాలను పారవేసే కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం చేరింది. మధురవాడ వికలాంగుల కాలనీలోని ఓ ఇంట్లో మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో నింపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడలో ఉన్న ఇంటిని యజమాని దంపతులకు అద్దెకు ఇచ్చాడు. అయితే జూన్ 2021లో అద్దెదారు తన భార్య గర్భం దాల్చిందని, మిగిలిన బకాయిలు చెల్లించలేనని చెప్పి అకస్మాత్తుగా ఇంటిని ఖాళీ చేశాడు.

శరీర భాగాల పరిస్థితిని బట్టి ఏడాది క్రితం హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. "శరీరం అద్దెదారు భార్యకు చెందినదని మేము అనుమానిస్తున్నాము" అని విశాఖపట్నం పోలీసు కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ అన్నారు. ''ఇంట్లో ఉన్న సామాన్లు క్లియర్ చేయడానికి ఇంటి యజమాని బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అద్దెదారు ఒకసారి ఇంటి వెనుక తలుపు నుండి ఇంటికి వచ్చాడని, అయితే యజమానికి డబ్బు చెల్లించలేదని, ఒక సంవత్సరం పాటు వేచి ఉన్న తరువాత యజమాని ఈ రోజు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అద్దెదారు ఇంట్లోని డ్రమ్‌లో మహిళ మృతదేహం కనుగొనబడిందిప'' పోలీసు కమిషనర్‌ చెప్పారు.

ఏడాది క్రితం మృతదేహాన్ని ముక్కలుగా నరికివేసినట్లు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో ఢిల్లీలో అఫ్తాబ్ అమీన్ పూనావాలా తన లైవ్-ఇన్ గర్ల్ ఫ్రెండ్ శ్రద్ధా వాకర్‌ను చంపి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికిన ఆరోపణలపై అరెస్టు చేసినప్పటి నుండి.. ఇలాంటి అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

Next Story