మహంకాళి ఆలయంలో కలకలం.. అమ్మవారి పాదాల వద్ద.. మొండెం లేని తల

Decapitated head found at Mahankali temple in Nalgonda. నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని మెట్టు మహంకాళి ఆలయంలో మహంకాళి అమ్మవారి

By అంజి  Published on  10 Jan 2022 5:31 AM GMT
మహంకాళి ఆలయంలో కలకలం.. అమ్మవారి పాదాల వద్ద.. మొండెం లేని తల

నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని మెట్టు మహంకాళి ఆలయంలో మహంకాళి అమ్మవారి విగ్రహం పాదాల వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి శిరచ్ఛేదమైన తలను స్థానికులు గుర్తించారు. ఈ దారుణ దృశ్యం స్థానికుల్లో కలకలం రేపింది. బాధితుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. కానీ అతని వయస్సు దాదాపు 35 సంవత్సరాలు. ఇది నరబలి కేసు అయి ఉండొచ్చని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి తలను దేవత పాదాల చెంత ఉంచి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివాహేతర సంబంధంపై కొద్ది రోజుల క్రితం సంఘటన స్థలానికి సమీపంలోని కుర్మేడు వద్ద పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కూలీల మధ్య ఘర్షణ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయం వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగడం లేదు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it