హైదరాబాద్ లో ప్రాణం తీసిన రేబిస్..ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా!!

హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది

By -  Knakam Karthik
Published on : 6 Oct 2025 7:36 PM IST

Crime News, Hyderabad, Rabies, Boy Death

హైదరాబాద్ లో ప్రాణం తీసిన రేబిస్..ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా!!

హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన మైదం శ్రీనివాస్ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. ఈ కుటుంబం మాదాపూర్‌లో నివాసం ఉంటోంది. రెండు నెలల క్రితం శ్రీనివాస్ కుమారుడు శ్రీచరణ్‌ను కుక్క కరిచింది. వెంటనే అతనికి ఇంజక్షన్ కూడా చేయించారు. అయితే రెండు రోజుల క్రితం శ్రీచరణ్ అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు తార్నాకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీచరణ్ మృతి చెందాడు.

రేబిస్‌ ప్రారంభంలో కొందరిలో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కాబట్టి, ఇలాంటి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి. రేబిస్ వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకు పాకిన సందర్భాల్లో గుటక వేయడం కష్టంగా మారుతంది. లాలాజలం నోటి నుంచి అసంకల్పితంగా బయటకు వచ్చేస్తుంది. పెదవుల చివరన నురగ కనిపిస్తుంది. వైరస్ కారణంగా గొంతు వద్ద ఉన్న కండరాలు దెబ్బతిన్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. నీటిని చూసి భయపడుతున్నారంటే రేబిస్ బారినపడ్డట్టు అనుమానించాలి. తొలి దశ లక్షణాలు కనిపించిన రెండు వారాలు వ్యాధికి సంబంధించి తీవ్ర ముప్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story