మూగ, చెవిటి మహిళపై సామూహిక అత్యాచారం.. గ్రామస్తులు చూడడంతో..

Deaf, mute woman gang raped in Rajasthan. రాజస్థాన్‌లో మరో దారుణ ఘటన జరిగింది. బార్మర్ జిల్లాలో చెవిటి, మూగ మహిళపై గురువారం ఐదుగురు

By అంజి  Published on  25 Nov 2022 10:42 AM GMT
మూగ, చెవిటి మహిళపై సామూహిక అత్యాచారం.. గ్రామస్తులు చూడడంతో..

రాజస్థాన్‌లో మరో దారుణ ఘటన జరిగింది. బార్మర్ జిల్లాలో చెవిటి, మూగ మహిళపై గురువారం ఐదుగురు పురుషులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 20 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ధోరిమన్న పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మహిళ పొలంలో మేకలు మేపేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బొలెరో కారులో వచ్చిన నిందితులు మహిళను పట్టుకుని అత్యాచారానికి పాల్పడ్డారు.

గ్రామస్తులను చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. కాగా, గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ధోరిమన్న ఎస్‌హెచ్‌ఓ సుఖ్‌రామ్ విష్ణోయ్ మాట్లాడుతూ.. మహిళ ఆసుపత్రిలో చేరి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. కాగా, మహిళ ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నందున ఇప్పటికిప్పుడు ఏమీ స్పష్టంగా చెప్పలేమని బార్మర్ ఎస్పీ దీపక్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు పలుచోట్ల నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story
Share it