తల్లిని చంపిన మైనర్‌ బాలిక.. మైనర్‌ ప్రియుడితో కలిసి..

Daughter who killed her mother. ఇద్దరు మైనర్లే.. ప్రేమలో పడ్డారు. విషయం తెలిసిన తల్లి అతడితో తిరగొద్దని మైనర్ బాలిక(17)ను మందలించింది.

By అంజి  Published on  19 Oct 2021 3:21 AM GMT
తల్లిని చంపిన మైనర్‌ బాలిక.. మైనర్‌ ప్రియుడితో కలిసి..

ఇద్దరు మైనర్లే.. ప్రేమలో పడ్డారు. విషయం తెలిసిన తల్లి అతడితో తిరగొద్దని మైనర్ బాలిక(17)ను మందలించింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న మైనర్ బాలిక.. తన ప్రియుడి ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి తల్లిని హత్య చేశారు. ఆ తర్వాత తల్లి కింద పడి చనిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు. కలకలం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లోని చింతల్‌మెట్‌లో జరిగింది. చింతల్‌మెట్‌లో దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురుకు పెళ్లి చేశారు. చిన్న కూతురు ఓ మైనర్‌ బాలుడి (17)తో ప్రేమ వ్యవహారం సాగిస్తోంది. వీరి ప్రేమ వ్యవహారం మైనర్‌ బాలిక తల్లికి తెలిసింది.

దీంతో ఆ బాలికను తల్లి పలు మార్లు మందలించింది. అతడితో తిరగొద్దని బాలికకు పదే పేద చెప్పింది.ఎంతకు వినని మైనర్‌ బాలిక.. తల్లిపై కోపం పెంచుకుంది. సోమవారం నాడు తల్లితో బాలిక తీవ్ర వాగ్వాదానికి దిగింది. ప్రియుడిని పిలిపించుకుని.. తల్లి మెడకు చున్నీ చుట్టి హత్య చేసింది. ఆ తర్వాత తల్లి కిందపడి చనిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు. తల్లిని మైనర్‌ బాలిక హత్య చేసిన సమయంలో తండ్రి ఇంట్లో లేడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మైనర్‌ బాలిక, బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల దర్యాప్తులో తామే హత్య చేసినట్లుగా మైనర్‌ లవర్స్‌ అంగీకరించారు.

Next Story
Share it