కన్నతల్లి ఒంటి మీద బంగారం కోసం దారుణానికి ఒడిగట్టిన కూతురు
నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిదండ్రులతో ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు బిడ్డలు.
By Medi Samrat
నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిదండ్రులతో ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు బిడ్డలు. అలాంటి ఓ ముద్దుల కూతురు గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. బంగారం కోసం ఓ కూతురు తల్లిని అడవిలో వదిలేసింది. రెండు రోజుల పాటు ఆ వృద్ధురాలు అడవిలో తిరుగుతూ ఉండిపోయింది.
జగిత్యాల జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇస్లాంపూర్ వీధిలో బుధవ్వ అనే వృద్ధురాలు తన కూతురు ఈశ్వరితో కలిసి ఉంటోంది. తల్లి బుధవ్వ ఒంటిపై ఉన్న నగల కోసం ఈశ్వరి దారుణానికి ఒడిగట్టింది. రెండు రోజుల క్రితం బుధవ్వను గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె శివార్లలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆపై బుధవ్వ ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని తల్లిని వదిలేసి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు తిండి లేక, తాగడానికి నీరు లేక అడవిలోనే ఉండిపోయింది. అటుగా వెళ్లిన యువకులు బుధవ్వను గమనించి అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న జిల్లా అధికారులు బుధవ్వను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బుధవ్వ తన కూతురు చేసిన పనిని అధికారులకు చెప్పింది.
ఓటర్ల ధృవీకరణ, ఓటర్ల నమోదు, ఇతర ఎన్నికల సంబంధిత ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే సమయంలో బి.ఎల్.ఓ.లను ఓటర్లు సులభంగా గుర్తించేందుకు వీలుగా ఇ.ఆర్.ఓ.ల ద్వారా నియమితులైన బూత్ స్థాయి అధికారులకు ఇకపై ప్రామాణిక ఫోటో గుర్తింపు కార్డులను అందజేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తద్వారా ఓటర్ల నమోదు, జాబితాల తనిఖీ వంటి కార్యక్రమాల సందర్భంగా బి.ఎల్.ఓ.లను గుర్తించి, వారితో ఓటర్లు నమ్మకంగా వారి సమచారాన్ని పంచుకొనేందుకు అవకాశం కలుగుతుంది. ఎన్నికల సంబంధ విధులకు సంబంధించి భారత ఎన్నికల సంఘం, ఓటర్ల మధ్య బి.ఎల్.ఓ.లు మొదటి స్థాయి అనుసంధాన వ్యవస్థగా వున్న నేపథ్యంలో ఇంటింటి సందర్శనలకు వెళ్లేటపుడు ప్రజలు వారిని సులువుగా గుర్తించేలా వుండాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.