అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడ‌ని తండ్రిని చంపిన కూతురు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.

By Knakam Karthik
Published on : 10 July 2025 10:40 AM IST

Crime News, Hyderabad, Ghatkesar Police, Daughter Kills Father, Extramarital Affair

ప్రియుడు, తల్లితో కలిసి తండ్రిని చంపిన కూతురు..డెడ్‌బాడీ ఇంట్లోనే వదిలేసి సినిమాకు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని తల్లి, ప్రియుడితో కలిసి ఓ కుమార్తె హత్య చేసింది. తండ్రిని హత్య చేశాననే జాలి, భయం లేకుఒడా సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చింది.ఆపై తల్లి ప్రియుడితో కలిసి మృతదేహాన్ని చెరువులో పడేసింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగం (45) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్. వీళ్ల కూతురు మనీషాకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఈమె తన భర్త కంచర్ల రమేశ్‌​ను వదిలి మల్కాజిగిరికి చెందిన మహ్మద్ జావేద్(24)తో కలిసి మౌలాలీలో ఉంటోంది. ఇది తండ్రి లింగంకు నచ్చలేదు. అతను కల్లుకు బానిసకావడంతో రోజూ తాగి వచ్చేవాడు. కూతురు ఇంటికి వచ్చినప్పుడల్లా భార్య, బిడ్డలను వివాహేతర సంబంధం గురించి ప్రశ్నిస్తూ వేధించేవాడు. దీంతో తండ్రి తమకు అడ్డువస్తున్నాడని భావించిన కూతురు అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. తల్లి, ప్రియుడికి విషయం చెప్పి ప్లాన్ వేసింది.

ఈనెల 5న కుమార్తె మనీషా తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చింది. వాటిని కల్లులో కలిపిన భార్య శారదా భర్త లింగంకు ఇచ్చింది. కల్లు తాగిన అతను నిద్రలోకి వెళ్లాడు. అదే సమయంలో కుమార్తె. జావిద్ ఇంట్లోకి ప్రవేశించారు. ముగ్గురు కలిసి ముఖంపై దిండు పెట్టి ఊపిరి రాకుండా చేయడంతో చనిపోయాడు. ఆ తరువాత ముగ్గురు కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని కారులో ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్ చెరువుకు తీసుకొచ్చి అందులో పడేశారు. ఈనెల 7న పోలీసులు చెరువు మృతదేహం గుర్తించి గాంధీ ఆసుపత్రి కి తరలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో హత్యగా భావించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధానికి అడ్డు రావడంతో పాటు తల్లిని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడనే కారణంగా తండ్రిని హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు మృతుడిని కుమార్తె మనీషా, ఆమె ప్రియుడు జావీద్, భార్య శారదాలను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Next Story