అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తల నరికి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన అత్త

Daughter in law killed by aunty in Annamayya district. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలు వసుంధర(35)ను అత్త సుబ్బమ్మ

By అంజి
Published on : 11 Aug 2022 4:22 PM IST

అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తల నరికి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన అత్త

అన్నమయ్య జిల్లా కె.రామాపురంలో దారుణం

కోడలు వసుంధర (35) తల నరికి చంపిన అత్త సుబ్బమ్మ

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలు వసుంధర(35)ను అత్త సుబ్బమ్మ అతి కిరాతకంగా హత్య చేసింది. కోడలు తల నరికి చంపింది. ఈ ఘటన జిల్లాలోని రాయచోటి మండలం కె.రామాపురంలో జరిగింది. కోడలిని చంపిన అనంతరం.. కోడలి తలతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అత్త లొంగిపోయింది. తన కోడలిని తానే హత్య చేశానంటూ పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకుంది. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్‌ అయ్యారు. అయితే ఈ ఘటనలో సుబ్బమ్మకు, ఆమె సమీప బంధువుల సహకరించినట్లు తెలుస్తోంది.

కుటుంబ కలహాలతో అత్త సుబ్బమ్మ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా అత్త, కోడళ్లకు పోసగడం లేదని, ఈ క్రమంలో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఇవాళ ఆవేశంతో కోడలిపై అత్త దాడికి దిగింది. కత్తి తీసుకుని వసుంధర తల నరికేసింది. కోడలి తల పట్టుకుని పీఎస్‌కు వెళ్లిన సుబ్బమ్మను చూసిన జనం బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రాయచోటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి తరలించారు.

Next Story