మైనర్ బాలికలపై అత్యాచారం.. అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్.. డ్యాన్స్ టీచర్ అరెస్ట్

Dance teacher held for molesting, blackmailing minor girl in Kanpur. మైనర్ బాలికలపై అత్యాచారం చేసి, వారి అభ్యంతరకర వీడియోలను ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తానని బెదిరించి వారి నుండి డబ్బు వసూలు

By అంజి  Published on  22 Dec 2021 9:00 AM GMT
మైనర్ బాలికలపై అత్యాచారం.. అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్.. డ్యాన్స్ టీచర్ అరెస్ట్

మైనర్ బాలికలపై అత్యాచారం చేసి, వారి అభ్యంతరకర వీడియోలను ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తానని బెదిరించి వారి నుండి డబ్బు వసూలు చేశాడనే ఆరోపణలపై మంగళవారం డ్యాన్స్‌ టీచర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఓ బాలిక తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.20 వేలు నగదు బదిలీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయాయని ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. నిందితుడి ఖాతాలోకి నగదు బదిలీ అయినట్లు క్రైం బ్రాంచ్ సైబర్ సెల్ గుర్తించింది. తదుపరి విచారణలో.. నిందితుడి మొబైల్ ఫోన్ నుండి మరో 14 మంది అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, అనేక చిత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు దొరికిన అమ్మాయిలందరూ కాన్పూర్‌లోని ప్రముఖ డ్యాన్స్ స్కూల్ విద్యార్థినులు" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

గోవింద్ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రోహిత్ తివారీ మాట్లాడుతూ, "ఎఫ్ బ్లాక్ డబౌలి నివాసి, నిందితుడు ఆర్యన్ సోనీ మైనర్, యుక్తవయసులో ఉన్న బాలికలపై అత్యాచారం చేసేవాడు. వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి నేరపూరిత చర్య వీడియోలను రూపొందించాడు. 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు తన తల్లి బ్యాంక్ ఖాతా నుండి టీచర్‌ స్నేహితుని ఖాతాకు ₹20,000 బదిలీ చేసిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు. బాధితురాలి తల్లి కాన్పూర్ పోలీసుల సైబర్ సెల్‌లో మోసం కేసును నమోదు చేసింది. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై అత్యాచారం, మోసం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్యాన్స్ టీచర్‌చే అత్యాచారం చేయబడిన ఇతర బాలికలు, డ్యాన్స్ స్కూల్‌లో దాదాపు ప్రతిరోజూ తాము లైంగికంగా దోపిడీకి గురవుతున్నామని పోలీసులకు చెప్పారు. "కొందరు అమ్మాయిలు విడిచిపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, వారి రికార్డ్ చేసిన వీడియోలను ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తామని బెదిరించారు" అని పోలీసులు చెప్పారు. కాన్పూర్ సౌత్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రవీనా త్యాగి మాట్లాడుతూ, "పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు లేదా వారి కుటుంబాలు వారి ఫిర్యాదులతో ముందుకు వస్తే మరిన్ని కేసులు నమోదు చేయబడతాయి." అని అన్నారు.

Next Story