మహిళపై నలుగురు గ్యాంగ్‌రేప్.. చేతులు, కాళ్లు కట్టేసి..
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 27 Dec 2023 8:11 AM IST
మహిళపై నలుగురు గ్యాంగ్‌రేప్.. చేతులు, కాళ్లు కట్టేసి..
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. బారాబంకి జిల్లాలోని దేవా ప్రాంతంలో దళిత మహిళపై అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం భర్తతో గొడవపడి అత్తమామల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తన తల్లి ఇంటికి వెళుతుండగా, నలుగురు వ్యక్తులు - మొఘల్ ఆజం అలియాస్ రియాజ్, అష్రఫ్ అలియాస్ భురే, షబ్బు, ఇస్లాముద్దీన్ - ఆమెను ఒక కారులో డ్రాప్ చేయడానికి ముందుకొచ్చారని పోలీసులు తెలిపారు.
తాను కారులో కూర్చోవడానికి నిరాకరించడంతో, వారిలో ఇద్దరు తనను వెనుక సీట్లో కూర్చోమని బలవంతం చేశారని, తన నోటిలో గుడ్డను బిగించారని మహిళ ఆరోపించింది. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వారు తెలిపారు.
మహిళకు అవకాశం దొరికింది. తన కోడలికి ఫోన్ చేసి జరిగిన మొత్తం గురించి ఆమెకు చెప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆమెను రక్షించి నిందితులలో ఒకరిని పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో సరైన చర్యలు తీసుకోకపోవడంతో, జరిగిన సంఘటనపై పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు మహిళ తెలిపింది. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, నిందితులందరినీ అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సీఎన్ సిన్హా తెలిపారు.