దారుణం.. జీతం అడిగినందుకు.. దళితుడిపై దాడి, మూత్ర విసర్జన చేశారు

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక దళిత వ్యక్తి పౌల్ట్రీ ఫామ్‌లో చేసిన పనికి పెండింగ్‌లో ఉన్న వేతనాన్ని డిమాండ్ చేసినందుకు తండ్రీ కొడుకులు అతని ముఖం మీద ఉమ్మివేసి, మూత్ర విసర్జన చేశారు.

By అంజి  Published on  10 Oct 2024 12:48 PM IST
Dalit man, assaulted, urinated,wages, Bihar, Crime

దారుణం.. జీతం అడిగినందుకు.. దళితుడిపై దాడి, మూత్ర విసర్జన చేశారు

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక దళిత వ్యక్తి పౌల్ట్రీ ఫామ్‌లో చేసిన పనికి పెండింగ్‌లో ఉన్న వేతనాన్ని డిమాండ్ చేసినందుకు తండ్రీ కొడుకులు అతని ముఖం మీద ఉమ్మివేసి, మూత్ర విసర్జన చేశారు. అక్టోబరు 4న రింకు మాంఝీ అనే వ్యక్తి తాను చేసిన రెండు రోజుల పనికి కూలీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిందితుడు రమేష్ పటేల్ పౌల్ట్రీ ఫారానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.

అతని వేతన డిమాండ్‌పై కోపంతో.. రింకూను రమేష్ పటేల్, అతని సోదరుడు అరుణ్ పటేల్, అతని కుమారుడు గౌరవ్ కుమార్ కొట్టారు. రమేష్ పటేల్, అతని కుమారుడు గౌరవ్ కుమార్.. బాధితుడిపై మూత్ర విసర్జన చేశారని, వారు అతని ముఖంపై ఉమ్మివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రింకూ మాంఝీ అక్టోబర్ 8న తన ఫిర్యాదులో నిందితుడికి వ్యతిరేకంగా పోలీసులకు సాక్ష్యంగా పంచుకున్నారు.

ఫిర్యాదు స్వీకరించిన తర్వాత, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు SC/ST చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి, ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ముజాఫర్‌పూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ (రూరల్‌) విధా సాగర్‌ మాట్లాడుతూ.. కర్పూర్‌ నార్త్‌లో నివసించే రమేష్‌ పటేల్‌ అనే వ్యక్తి కుల దురభిమానాలతో దూషించాడని, రింకు అనే వ్యక్తి రమేష్‌ ఇంట్లో పనిచేశాడు. అతను తన వేతనాన్ని డిమాండ్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగింది. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాము.

"వ్యక్తి అందించిన వీడియో ఆధారంగా మేము నిందితులను గుర్తించాము. విచారణ ద్వారా వారిని అరెస్టు చేస్తామని" అధికారి తెలిపారు. అంతకుముందు, ముజఫర్‌పూర్‌లో మరో కేసులో, మోటార్‌సైకిల్‌ను దొంగిలించినందుకు ఇద్దరు దళిత యువకులను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి, మూత్ర విసర్జన చేశారు. బాధితులు గ్రామీణ జాతరకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన అనంతరం నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Next Story