తల్లి ప్యాట్రోల్ నటి.. కొడుకు ఎలా మరణించాడంటే.?

క్రైమ్ ప్యాట్రోల్ తో సహా అనేక సీరియల్స్‌లో పనిచేసిన టీవీ నటి సప్నా సింగ్ తన కుమారుడిని కోల్పోయింది.

By Medi Samrat  Published on  11 Dec 2024 8:33 PM IST
తల్లి ప్యాట్రోల్ నటి.. కొడుకు ఎలా మరణించాడంటే.?

క్రైమ్ ప్యాట్రోల్ తో సహా అనేక సీరియల్స్‌లో పనిచేసిన టీవీ నటి సప్నా సింగ్ తన కుమారుడిని కోల్పోయింది. ముంబై నుండి భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని రసులా గ్రామంలోని తన తల్లి ఇంటికి వచ్చి చూడగా ఆమె ఏకైక కుమారుడు సాగర్ మృతదేహాన్ని చూసి నిస్చేస్టురాలైంది.

ఈ మృతికి నిరసనగా గ్రామస్తులతో కలిసి బిసల్‌పూర్ రహదారిని దిగ్బంధించారు. సాగర్ మృతదేహాన్ని మంచంపై తీసుకొచ్చి రోడ్డుపై ఉంచి పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కేసులో కుమారుడి స్నేహితులపై కూడా హత్య కేసు నమోదైంది.

నటి సప్నా సింగ్ 14 ఏళ్ల కుమారుడు సాగర్ ఆనంద్ విహార్ కాలనీలో తన మేనమామ ఓంప్రకాష్‌తో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం బరేలీలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అదాలఖియా గ్రామ సమీపంలో సాగర్ మృతదేహం పడి ఉంది. ఇజ్జత్‌నగర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

సాగర్ అదృశ్యమైనప్పుడు అతని మామ మిస్సింగ్ రిపోర్టును నమోదు చేశారు. సోమవారం అతడి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సాగర్ స్నేహితులు అనుజ్, సన్నీలను అదుపులోకి తీసుకున్నారు. తాము కలిసి డ్రగ్స్, మద్యం సేవించినట్లు విచారణలో అనుజ్ తెలిపాడు. సాగర్‌ కాక్‌టెయిల్స్ ఎక్కువ మోతాదులో తాగి పడిపోయాడు. స్నేహితులు ఇద్దరూ భయపడిపోయి రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లి సాగర్ ను పొలంలో పడేశారు. తర్వాత తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. సాగర్ చనిపోతాడని తాము అనుకోలేదని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అందులో స్నేహితులిద్దరూ సాగర్‌ను ఈడ్చుకెళ్లడం కనిపించింది. పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు.

Next Story