దారుణం.. వివాహితపై ఎదురింట్లో ఉండే వ్యక్తి అత్యాచారం.. వీడియో తీసిన నిందితుడి భార్య
Couple molested married woman in Vijayawada.ఇటీవల కాలంలో మహిళలపై ఆగడాలు పెరిగిపోతున్నాయి. దేశంలో
By తోట వంశీ కుమార్
ఇటీవల కాలంలో మహిళలపై ఆగడాలు పెరిగిపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. విజయవాడలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎదురింటిలో ఉండే ఓ మహిళను ఇంట్లోకి లాక్కొచ్చిన ఓ నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. కళ్ల ముందే భర్త వేరే మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన భార్య .. భర్తకు సహకరించింది. అంతేకాకుండా ఆ దృశ్యాలను మొబైల్‌లో రికార్డు చేసింది.
వివరాల్లోకి వెళితే.. అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలో బాధిత మహిళ(25) భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త కేటరింగ్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 3న బాధిత మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తోండగా.. ఎదురింటిలో నివసించే దిలీప్, తులసి దంపతులు రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. మహిళ నోరు మూసేసి బలవంతంగా ఆమెను తమ ఇంట్లోకి లాక్కెల్లిపోయారు. అక్కడ ఆమెపై దిలీప్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన మొత్తాన్ని తులసీ వీడియో తీసింది. ఆ మరుసటి రోజు ఆ వీడియోలను చూపించి మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. పిల్లలను చంపేయడంతో పాటు ఆ వీడియోలను బయట పెడతానని బెదిరించాడు. ఈ క్రమంలో తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని బాధిత మహిళలపై దిలీప్ బెదిరింపులకు దిగాడు. అతడి ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతుండడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దిలీప్, తులసీ దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.