బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతుల దుర్మరణం

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో వారి బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో దంపతులు మరణించారు. ఈ ఘటనలో మృతి చెందిన దంపతుల

By అంజి  Published on  11 Jun 2023 1:30 AM GMT
Couple died, Jharkhand, Road accident

బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతుల దుర్మరణం

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో శుక్రవారం వారి బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో దంపతులు మరణించారు. ఈ ఘటనలో మృతి చెందిన దంపతుల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుని సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త, భార్య, కుమారుడు బైక్‌పై తమ ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో కొడుకు కోసం డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. రోడ్డుపై రెండు ఫార్చ్యూనర్ కార్లు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. జంట బైక్‌ను ముందు నుంచి కారు ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న భర్త దాదాపు 100 అడుగుల మేర పడిపోయాడు.

రాణా దాస్ అనే భర్త అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య మాన్సీ దాస్ షాహీద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుండి మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. మరణించిన దంపతుల 12 ఏళ్ల కుమారుడు రిషబ్ దాస్ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఆసుపత్రిలో పరిస్థితి విషమంగా ఉంది. ఝరియా ఎమ్మెల్యే పూర్ణిమా నీరజ్ సింగ్ బావమరిది హర్ష్ సింగ్ పేరిట కారు రిజిస్టర్ అయిందని రాణా దాస్ సోదరుడు తెలిపారు. ఘటన అనంతరం బీజేపీ నాయకురాలు రాగిణి సింగ్ ఆస్పత్రిలో ఉన్న మృతుల బంధువులను పరామర్శించి వారిని ఓదార్చారు. మృతుడు రాణా దాస్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లో పనిచేసినందున, గాయపడిన చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని బీసీసీఎల్ అధికారులు ఫోన్‌లో తెలిపారు.

Next Story