కరీంనగర్‌లో దంపతులు ఆత్మహత్య.. ఆ కారణంతోనే..

Couple commits suicide in Karimnagar. కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌లో ఆర్థిక సమస్యలతో తట్టుకోలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇతర కుటుంబ

By అంజి  Published on  6 March 2022 8:15 AM IST
కరీంనగర్‌లో దంపతులు ఆత్మహత్య.. ఆ కారణంతోనే..

కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌లో ఆర్థిక సమస్యలతో తట్టుకోలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇతర కుటుంబ సభ్యులు లేచి చూసే సరికి నార్ల వెంకటేశం (58), సుజాత (50) ఇంటి పక్కనే ఉన్న ఇనుప రాడ్లకు ఉరివేసుకుని కనిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రించిన వెంకటేశం, సుజాత ఉదయం ఉరి వేసుకుని కనిపించారు. మార్కెట్‌లో కిరానా దుకాణం నడుపుతున్న వెంకటేశంకు కోవిడ్‌ కారణంగా లాభాలు రాకపోవడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

మహారాష్ట్రలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఈ దంపతుల కుమారుడు శ్రీకాంత్ కోవిడ్ మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. శ్రీకాంత్ తన కుటుంబంతో పాటు కరీమంగర్‌లో తల్లిదండ్రులతో పాటు ఉంటున్నాడు. తమ ఆర్థిక ఇబ్బందుల గురించి తరచూ చర్చించుకునే ఈ జంట.. విపరీతమైన నిర్ణయం తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story