కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)లో తన స్నేహితులతో కలిసి ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. క్యాంపస్‌లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో పాటు అతని స్నేహితుడుపై విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగినప్పటికీ సోమవారం వెలుగులోకి వచ్చింది.
నిందితులు 21 ఏళ్ల బాధితురాలు ఆడిటోరియం సమీపంలోని వాహన పార్కింగ్ స్టాండ్‌లో మొబైల్‌లో మాట్లాడుతుండగా ఆమెను వేధించి అత్యాచారం చేశారు. ఆమె సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించడంతో, ఆమె స్నేహితులు పార్కింగ్ స్టాండ్ వైపు పరుగులు తీశారు. వారిని చూడగానే నిందితులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.
నిందితులు డి నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వి కన్నన్, అతని స్నేహితుడు ఎస్ శివను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ కాలాపేటలోని సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.