ముఖానికి ముసుగులతో కనిపిస్తున్న ఈ గ్యాంగ్ చేస్తున్న క్రైమ్ ఏమిటో తెలుసా..?

Computer engineer among 3 held with synthetic drugs worth Rs 25 lakh. నోయిడా, సెక్టార్ 61లోని మహిళా టెకీ ఇంట్లో దాదాపు రూ.25 లక్షల విలువైన సింథటిక్ డ్రగ్ రాకెట్‌ను పోలీసులు చేధించారు

By M.S.R  Published on  14 March 2023 8:15 PM IST
ముఖానికి ముసుగులతో కనిపిస్తున్న ఈ గ్యాంగ్ చేస్తున్న క్రైమ్ ఏమిటో తెలుసా..?
నోయిడా, సెక్టార్ 61లోని మహిళా టెకీ ఇంట్లో దాదాపు రూ.25 లక్షల విలువైన సింథటిక్ డ్రగ్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. దాదాపు 300 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళా టెక్కీతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులు 24 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులేనని, వారు రహస్య రేవ్ పార్టీలకు ఈ నిషేధిత మాత్రలను సరఫరా చేశారని పోలీసు అధికారి తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) రామ్ బదన్ సింగ్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యాపారిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారని.. అతను ఇచ్చిన సమాచారం ద్వారా మిగిలిన ఇద్దరినీ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.


మమురా నివాసి అభిషేక్ చౌహాన్‌, పూజా గుప్తా, ఆమె స్నేహితుడు పుల్కిత్ కపూర్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. "సమాచారం ఆధారంగా, సెక్టార్ 61లోని ఒక ఇంటిపై దాడి చేశారు, అక్కడ నుండి 289 MDMA మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటూ ఆమె స్నేహితుడిని, డ్రగ్ ట్రాఫికర్‌ను అరెస్టు చేశారు. వారితో సంబంధం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు” అని DCP సింగ్ తెలిపారు. నిందితులు ఏడాది కాలంగా ఈ పనిచేస్తున్నారని, వారికి సంబంధించిన మరిన్ని వివరాలను శోధిస్తున్నామని తెలిపారు.


Next Story