ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి

Collision between a car and a truck in gujarat.గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ ట్ర‌క్కు-కారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2021 4:50 AM GMT
ఘోర  రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి

గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ ట్ర‌క్కు-కారు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో 10 మంది మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.

ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద వ‌టామ‌న్ మార్గంలో ప్ర‌యాణిస్తున్న కారు ఎదురుగా వ‌స్తున్న ట్ర‌క్కు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న 10 మంది అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం తారాపూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల‌ను గుర్తించేందుకు య‌త్నిస్తున్నారు.

Next Story
Share it