ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం.. చివరికి..
ఓ యువకుడు ఓ యువతతో సహజీవనం చేస్తూ మరో యువతీతో ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 23 July 2023 12:56 PM ISTఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం.. చివరికి..
ఓ యువకుడు ఓ యువతతో సహజీవనం చేస్తూ మరో యువతీతో ప్రేమాయణం కొనసాగించాడు. చివరకు ఇద్దరి యువతులకు విషయం తెలియడంతో ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లాకు చెందిన శివప్రసాద్ (23) అనే యువకుడు ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ బస్తీలో అద్దెకు ఉంటూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతి తో శివప్రసాద్ సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల తాను పనిచేస్తున్న ఆస్పత్రిలో ప్రేమిస్తున్నా అంటూ ఓ నర్సు వెంటపడ్డాడు శివప్రసాద్. అంతే కాదండోయ్ ఆమెను నమ్మించేందుకు.. సినిమాల్లో హీరో తరహాలో ఛాతిపై ఆమె ఫొటో, పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.
దీంతో ఆ యువతి శివప్రసాద్ ప్రేమ బుట్టలో పడిపోయింది. అయితే మూడురోజుల క్రితం శివప్రసాద్ ఛాతిపై పచ్చ బొట్టును గమనించిన సహజీవనం చేస్తున్న యువతి శివప్రసాద్‌ని నిలదీసి అడిగింది.శివప్రసాద్ చెప్పిన సమాధానం విని ఆ యువతీ ఆగ్రహంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం శివప్రసాద్ తాను పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లి రెండో యువతిని పెళ్లి చేసుకుందా మని అడిగాడు. అయితే, అప్పటికే నిద్ర మాత్రలు మింగిన అతడి మొదటి ప్రియురాలు గురించి రెండవ యువతికి తెలిసిపోవడంతో పెళ్లికి తిరస్కరించింది. దీంతో శివప్ర సాద్ తీవ్ర మనస్థాపానికి గురై శనివారం తెల్లవారు జామున తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు. తొలి ప్రేయసి కోలుకోవడంతో ఆమెను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.