తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిని లోబరుచుకుని..
మహిళతో సహ జీవనం చేస్తూ.. ఆమె కూతురిపై కన్నేశాడో కామాంధుడు. ఆమెను లోబరుచుకుని అపహరించాడు.
By అంజి Published on 24 Oct 2024 8:27 AM ISTతల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిని లోబరుచుకుని..
మహిళతో సహ జీవనం చేస్తూ.. ఆమె కూతురిపై కన్నేశాడో కామాంధుడు. ఆమెను లోబరుచుకుని అపహరించాడు. ఒంగోలు పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తనకు భర్తకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు 10వ తరగతి చదువుతున్న కూతురు కూడా ఉంది. సదరు మహిళ టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు అనే వ్యక్తితో కొంతకాలంగా సహ జీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి బాలికను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లి.. తీసుకొచ్చేవాడు.
తల్లితో సహ జీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న అతడు తన అసలు అసలు రంగును బయటపెట్టాడు. ప్రేమ పేరుతో బాలికకు మాయ మాటలు చెప్పారు. రెండు రోజుల కిందట ఇద్దరూ స్కూల్‌కు అంటూ ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారు. సాయంత్రమైనా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. వెంటనే బాలిక తల్లి ఒంగోలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో బాలికతో పాటు నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. వారిని తిరిగి ఒంగోలుకు తీసుకొచ్చారు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.