దారుణం.. 17 ఏళ్ల బాలిక‌పై తండ్రి, సోద‌రుడి లైంగిక వేదింపులు

Class 11 Student Accuses Father, Brother Of Sexual Assault In Gurugram. ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2023 8:22 AM GMT
దారుణం.. 17 ఏళ్ల బాలిక‌పై తండ్రి, సోద‌రుడి లైంగిక వేదింపులు

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. బ‌య‌టి వారి నుంచే కాకుండా సొంత వారి నుంచి కూడా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. 17 ఏళ్ల బాలిక‌పై తండ్రి, సోద‌రుడు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఈ ఘ‌ట‌న గురుగ్రామ్‌లో జ‌రిగింది.

గురుగ్రామ్‌లో నివ‌సిస్తున్న 17 ఏళ్ల బాలిక 11వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. త‌న తండ్రి, సోద‌రుడు త‌న‌ను లైంగికంగా వేధిస్తున్నార‌ని పాఠ‌శాల‌కు ప్రిన్సిపాల్‌, టీచ‌ర్‌కు చెప్ప‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. వెంట‌నే వారు ఆమెను పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్లారు.

దాదాపు నాలుగు గంట‌ల పాటు పోలీసులు బాలిక‌కు కౌన్సెలింగ్‌, ప్ర‌శ్న‌లు అడిగారు. తండ్రి, సోద‌రుడు త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని, విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తామ‌ని వారు త‌న‌ను బెదిరించిన‌ట్లు బాలిక చెప్పిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ఫోక్సో చ‌ట్టంలోని వివిధ సెక్ష‌న్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. వాస్త‌వాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

Next Story