అమానుషం.. బాలుడిని గొలుసుతో కట్టి పనిలో పెట్టుకున్నాడు..!

Child Labor in Patna Shopkeeper Tied Minor with a Chain Making him work. మానవత్వం సిగ్గుపడే విషయం పాట్నాలో వెలుగు చూసింది. రాజధానిలోని పర్సా బజార్ పోలీస్ స్టేషన్‌లో ప‌రిధిలోని

By Medi Samrat  Published on  9 Jun 2023 3:48 PM IST
అమానుషం.. బాలుడిని గొలుసుతో కట్టి పనిలో పెట్టుకున్నాడు..!

మానవత్వం సిగ్గుపడే విషయం పాట్నాలో వెలుగు చూసింది. రాజధానిలోని పర్సా బజార్ పోలీస్ స్టేషన్‌లో ప‌రిధిలోని సైంచక్‌లో ఒక స్వీట్ దుకాణదారుడు 15 ఏళ్ల బాలుడిని గొలుసుతో కట్టి పనిలో పెట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ కావడంతో.. 'బచ్‌పన్ బచావో' బృందం స్వీట్ షాప్‌పై దాడి చేసి అమాయకుడిని విడిపించింది. బచ్‌పన్ బచావో బృందం పర్సా బజార్ పోలీస్ స్టేషన్‌లో దుకాణదారుడిపై కేసు నమోదు చేసింది. దుకాణదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై ఎస్‌హెచ్‌ఓ సంజీవ్ మౌర్ మాట్లాడుతూ.. 'బచ్‌పన్ బచావో' బృందానికి చెందిన దేవ్ వల్లభ్ మిశ్రా వచ్చి మైనర్ చిన్నారిని సైన్‌చక్‌లోని ఓ స్వీట్ షాప్‌లో కట్టేసి బలవంతంగా పని చేయిస్తున్నారని తెలిపాడు. దానికి సంబంధించిన వీడియో కూడా చూపించాడు. వీడియో ఆధారంగా, పోలీసు బృందం 'బచ్‌పన్ బచావో' అధికారితో దుకాణానికి చేరుకుని చిన్నారిని విడిపించింది. అనంత‌రం పోలీసులు దుకాణదారు అఖిలేష్ యాదవ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బచ్‌పన్ బచావో అధికారి దుకాణదారుపై పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దుకాణదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Next Story