ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ ఇంట విషాదం..‌ కుమార్తె ఆత్మహత్య

Chalasani Srinivas Daughter Commits Suicide. ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ ఇంట విషాదచాయ‌లు అల‌ముకున్నాయి.

By Medi Samrat  Published on  19 Feb 2021 9:49 AM IST
Chalasani Srinivas Daughter Commits Suicide

ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ ఇంట విషాదచాయ‌లు అల‌ముకున్నాయి. ఆయ‌న‌‌ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైద్రాబాడ్‌ రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న శిరిష్మకు.. గ్రానైట్‌ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016 డిసెంబర్‌లో వివాహమైంది. ప్రస్తుతం వారిద్దరు గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు.

అయితే.. శిరిష్మ‌కు పెళ్లై నాలుగేళ్లవుతున్నా.. వీరికి సంతానం కలగకపోవడంతో తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన సిద్ధార్థ్‌.. ఉరేసుకున్న శిరిష్మను చూసి కిందకి దింపి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.






Next Story