Video: మంకీ క్యాప్‌తో మంచి నీళ్ల కోసం ఎంటరై..గోల్డ్ చైన్‌తో పరారైన దొంగ..

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో బుధవారం తెల్లవారజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది.

By Knakam Karthik  Published on  12 March 2025 2:11 PM IST
Telangana, Hyderabad News, Chain Snatching, Kphb Colony, Kukatpally

Video: మంకీ క్యాప్‌తో మంచి నీళ్ల కోసం ఎంటరై..గోల్డ్ చైన్‌తో పరారైన దొంగ..

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో బుధవారం తెల్లవారజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. తన ఇంటి ముందు ఓ మహిళ ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్లింది. అంతలోనే ఓ దొంగ గేటు తోసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. తాగేందుకు నీళ్లు కావాలనే కారణం చెప్పి బాటిల్‌తో ఎంటరయ్యాడు. ముసుగు ధరించిన ఓ దొంగ..మంచి నీళ్లు కావాలంటూ ఆ మహిళను అడిగాడు. మంచినీళ్ల కోసం ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెనక ఆ చైన్ స్నాచర్ కూడా వెళ్లి మెడలోని గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

చైన్ స్నాచింగ్ ఘటనతో షాక్ అయిన ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి వీధిలోకి పరుగులు తీసింది. అప్పటికే ఆ దొంగ చైన్ స్నాచర్ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుని వెళ్లిపోయాడు. పొద్దుపొద్దునే జరిగిన ఈ ఘటనతో కేపీహెచ్ బీ కాలనీ ఉలిక్కి పడింది. చైన్ స్నాచర్లకు ఇంతకు బరితెగించారా అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. ఈ ఘటన అంతా ఆ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story