జనగామలో దారుణం.. పుస్తెలతాడు చోరీకి వెళ్లి చిన్నారిని సంపులో పడేశాడు.!

Chain snatcher threw a baby into water pit while snatching chain from her mother in jangaon. పుస్తెల తాడు చోరీకి వెళ్లి.. చిన్నారి సంపులో పడేశాడో ఓ దుండగుడు. దీంతో చిన్నారి మృతి చెందింది. ఈ దారుణ ఘటన జనగామ

By అంజి  Published on  1 Aug 2022 2:37 PM IST
జనగామలో దారుణం.. పుస్తెలతాడు చోరీకి వెళ్లి చిన్నారిని సంపులో పడేశాడు.!

పుస్తెల తాడు చోరీకి వెళ్లి.. చిన్నారి సంపులో పడేశాడో ఓ దుండగుడు. దీంతో చిన్నారి మృతి చెందింది. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో రోడ్డుపై వెళ్తున్న ప్రసన్న అనే మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కునేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. అయితే ఆ మహిళ చోరీని అడ్డుకునేందుకు దుండగుడితో పెనుగులాడింది. మహిళ ప్రతి ఘటించడంతో.. ఆమె చేతిలో ఉన్న పాపను తీసుకుని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

దుండగుడు చేసిన పని ఒక్కసారిగా షాకైన ప్రసన్న.. వెంటనే తేరుకుని పాపను రక్షించేందుకు ప్రయత్నించింది. స్థానికుల సాయంతో నీటి సంపులో నుంచి పాప తేజస్విని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది. అయినా ఆ తల్లి ఆశని కోల్పోలేదు. వెంటనే చిన్నారిని జనగామ ఎంసీహెచ్‌కు తరలించింది. పాపను పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో ఆ తల్లి రోదనలు అక్కడున్న వారిని విషాదంలో ముంచాయి. అప్పటిదాకా తన చేతిలో ఉన్న తన బిడ్డ ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిందని గుండలవిసేలా రోదిస్తోంది.

మంగళసూత్రం కోసం చూసుకుంటే.. తన కన్నబిడ్డ తనకు దూరమైపోయిందని ఆమె ఏడుపులు విన్న స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది కంటతడి పెట్టారు. అనంతరం మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహిళ మెడలో నుంచి చైన్ దొంగిలించేందుకు ప్రయత్నించిన ప్రాంతంలో సీసీటీవీలు ఉన్నాయో లేదో ఆరా తీస్తున్నారు. వీలైనంత త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story