రామోజీ ఫిలిం సిటీలో ఊహించని ప్రమాదం

రామోజీ ఫిల్మ్ సీటీలో జరిగిన ఓ సాప్ట్ వేర్ కంపెనీ ఈవెంట్ లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  19 Jan 2024 11:02 AM GMT
రామోజీ ఫిలిం సిటీలో ఊహించని ప్రమాదం

రామోజీ ఫిల్మ్ సీటీలో జరిగిన ఓ సాప్ట్ వేర్ కంపెనీ ఈవెంట్ లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. జనవరి 18వ తేదీ గురువారం రామోజీ ఫిల్మ్ సీటీలో విస్టెక్స్ అనే ఎంఎన్ సీ కంపెనీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు అమెరికాలోని చికాగోలో ఉంటున్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ, చీఫ్ అర్కికెట్ సంజయ్ షా (56) హైదరాబాద్ కు వచ్చారు. గురువారం రాత్రి ఆర్ఎఫ్ సిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సుమారు 700 మంది పాల్గొన్నారు.

సెలబ్రేషన్స్ జరుగుతుండగా రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఈవెంట్ కోసం వేసిన సెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు సంజయ్ షా. ఆయనతో పాటు విశ్వనాధ్ రాజ్(54) అనే మరో వ్యక్తిని వెంటనే చికిత్స కోసం మలక్ పేట్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ శుక్రవారం సంజయ్ మరణించారు. ఈ సంఘటనకు కారకులైన రామోజీ ఈవెంట్స్ ఆథారిటీపై కంపెనీ ఎక్స్ క్యూటివ్ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 336,287,r/w 34 చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

Next Story