ఎన్నారై మహిళపై అత్యాచారం.. సీఈవోపై కేసు నమోదు

తన కార్యాలయంలో పనిచేస్తున్న ఎన్నారై మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  15 Jan 2024 7:45 AM IST
NRI Ex Colleague, Delhi, Crime news

ఎన్నారై మహిళపై అత్యాచారం.. సీఈవోపై కేసు నమోదు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కార్యాలయంలో పనిచేస్తున్న ఎన్నారై మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన 2023 సెప్టెంబర్ 14న చాణక్యపురి జిల్లాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగింది. శనివారం రాత్రి భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్) కింద నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సీఈవోగా ఉన్న కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు ఫిర్యాదుదారు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి తన మామకు తెలుసునని, ఉద్యోగం సంపాదించడంలో తనకు సహకరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Next Story