తీవ్రవిషాదం..కాల్వలోకి దూసుకెళ్లిన కారు కుమారుడు మృతి, తండ్రీకూతురు గల్లంతు
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 March 2025 3:11 PM IST
తీవ్రవిషాదం..కాల్వలోకి దూసుకెళ్లిన కారు కుమారుడు మృతి, తండ్రీకూతురు గల్లంతు
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఓ కారు SRSP కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో బాలుడు మృతిచెందగా, తండ్రీకూతురు గల్లంతు అయ్యారు. భార్యను స్థానికులకు కాపాడారు. ప్రస్తుతం గజ ఈతగాళ్లతో తండ్రీ కూతురి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు సహాయక ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి, కుమారుడు ఆర్యవర్ధన్ సాయితో కలిసి హనుమకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. ఈక్రమంలో మార్గమధ్యలో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు గుండె నొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలో పడింది. స్థానికుల సాయంతో కృష్ణవేణి బయటపడింది. కుమారుడు మృతి చెందగా.. కారుతో సహా ప్రవీణ్, చైత్ర సాయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహాన్ని తగ్గించి ప్రవీణ్, చైత్రసాయి ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.