జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం డీసీఎంను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
పెంబర్తి వద్ద గల పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారి పై డీసీఎం టైర్ పంచర్ అయ్యింది. దీంతో డీసీఎంను రోడ్డు పక్కకు ఆపి డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ కలిసి టైరును మారుస్తున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్, క్లీనర్‌తో పాటు కారులో ఉన్న ఆరేళ్ల పాప కూడా ఘటనాస్థలంలోనే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. ఉదయాన్నే పొగ మంచు ఉండడమే ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.