శుభ‌కార్యానికి వెలుతుండ‌గా.. కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఒక‌రు మృతి

Car hit the culvert in Mulugu district.ఓ కారు అదుపుత‌ప్పి క‌ల్వ‌ర్టును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ద‌ర్మ‌ర‌ణం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Dec 2021 8:15 AM GMT
శుభ‌కార్యానికి వెలుతుండ‌గా.. కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఒక‌రు మృతి

ఓ కారు అదుపుత‌ప్పి క‌ల్వ‌ర్టును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ద‌ర్మ‌ర‌ణం చెందగా మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ములుగు జిల్లాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు కొత్త‌గూడెం జిల్లాలోని మ‌ణుగూరులో జ‌రిగే ఓ శుభ‌కార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదివారం తెల్ల‌వారుజామున బ‌య‌లు దేరారు. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని గంపలగూడెం మార్కెట్ గోడౌన్స్ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి కారు అదుపు త‌ప్పి క‌ల్వ‌ర్టును ఢీ కొట్టింది.

ప్ర‌శాంత్ అనే వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌శాంత్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిద్ర‌మ‌త్తు, అతివేగం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు బావిస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారు వేగం వంద‌కు పైనే ఉంద‌ని అంటున్నారు.

Next Story
Share it