పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
Car Accident in Nagarkurnool district four dead.పండుగ పూట విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on
2 April 2022 5:33 AM GMT

పండుగ పూట విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. చారకొండ మండలం తుర్కపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు.
మృతులను సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన సాధిక (55), గౌస్ ఖాన్ (55), ఫర్హానా (45), రోషన్ (24) చెందిన వారిగా గుర్తించారు. నేరేడుచర్లకు చెందిన వీరు కడప దర్గాను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story