శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీ.. 12 మందికి తీవ్ర గాయాలు

Car accident in nagarkurnool district. నాగర్‌ కర్నూలు జిల్లాలోని హైదరాబాద్‌ టూ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి.

By అంజి  Published on  29 Nov 2021 7:40 AM GMT
శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీ.. 12 మందికి తీవ్ర గాయాలు

నాగర్‌ కర్నూలు జిల్లాలోని హైదరాబాద్‌ టూ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఉప్పునుంతల మండలంలోని వెల్టూరు స్టేజీ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులలో ఉన్న 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లల పాటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న దొమ్మేరకు చెందిన తాడి వెంకటేశ్వరరావు, తాడి పద్మావతి భార్య భర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్రగాయాలు కాగా భీమడోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it