అకారణంగా కెనడియన్ ను చంపేశారు.. ఎలాంటి పుకార్లను నమ్మవద్దంటున్న పోలీసులు
Canadian Killed In Punjab. ఫిబ్రవరిలో కెనడా నుండి వచ్చిన వ్యక్తి మొహాలీలో స్థానికులతో జరిగిన గొడవలో మరణించినట్లు అధికారులు తెలిపారు
By M.S.R
Canadian Killed In Punjab
మొహాలి: ఫిబ్రవరిలో కెనడా నుండి వచ్చిన వ్యక్తి మొహాలీలో స్థానికులతో జరిగిన గొడవలో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని నిరంజన్ సింగ్‌గా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బాధితుడిని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని గజికోట్ విలేజ్ నివాసి ప్రదీప్ సింగ్ (24)గా గుర్తించారు. అతడు కెనడియన్ సిటిజన్.
మొహలీ లో పాటలు ఆపమని చెప్పినందుకు కెనడియన్‌ను హత్య చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘కొందరు వ్యక్తులు ఆరుబయట కారులో పెద్దగా పాటలు పెట్టుకుని వింటుండగా ప్రదీప్ సింగ్ వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆగ్రహానికి లోనైన వ్యక్తులు అతడి పై దాడి చేయగా ప్రదీప్ మరణించాడు’ అని కుటుంబ సభ్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. SSP మొహాలీ మాట్లాడుతూ, "సంఘటన సమయంలో బాధితుడు, ప్రదీప్ సింగ్ నిహాంగ్స్ డ్రెస్ కోడ్ ధరించాడు. అతను ఇప్పటివరకు ఏ నిహాంగ్ గ్రూప్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనలేదు" అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియోలన్నింటినీ పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. "ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తదుపరి విచారణ జరుగుతోంది" అని ఆయన తెలియజేశారు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి ఘర్షణలో మరణించినట్లు తమకు సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు. బాధితుడు కొన్ని నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అతని తల్లిదండ్రులకు ఏకైక సంతానం. మొహాలీకి వెళ్తుండగా ప్రదీప్‌ను గూండాలు హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.