ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృత్యువాత
Bus collide with car in up.ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో
By తోట వంశీ కుమార్ Published on
1 May 2021 2:48 AM GMT

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి బులంద్ షహర్ వెలుతున్న ప్రైవేటు బస్సు సంబల్‌పూర్ సమీపంలో 93వ జాతీయ రహదారిపై అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
కారు నుంచి మృతదేహాలను అతి కష్టం పైన వెలికి తీశారు. గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story