Hyderabad: యువతి దారుణ హత్య.. యువకుడు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ నగరంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అనంతరం మరో వ్యక్తి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

By అంజి
Published on : 28 Oct 2023 1:42 PM IST

murder, suicide, Hyderabad, Crime news

Hyderabad: యువతి దారుణ హత్య.. యువకుడు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ నగరంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అనంతరం మరో వ్యక్తి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చంపాపేట్ పరిధిలో చోటుచేసుకుంది. చంపాపేట్‌లోని రాజిరెడ్డి నగర్‌లో స్వప్న అనే యువతిని దారుణ హత్యకు గురైంది. అనంతరం అదే ఇంట్లో ఉంటున్న మరో వ్యక్తి రెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బిల్డింగ్ పై నుండి దూకడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేయడమే కాకుండా బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఇద్దరు ఎవరు ప్రేమికులా? లేక స్నేహితులా? అసలేం జరిగింది? యువతిని హత్య చేసి తాను ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story