విశాఖలో కలకలం.. తల్లీ కుమారుడి దారుణ హత్య

Brutal murder of mother and son in Visakhapatnam. విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లీ కుమారుడు హత్యకు గురయ్యారు. హత్యకు గురైన మహిళ, ఆమె కుమారుడి

By అంజి  Published on  9 Sept 2022 10:26 AM IST
విశాఖలో కలకలం.. తల్లీ కుమారుడి దారుణ హత్య

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లీ కుమారుడు హత్యకు గురయ్యారు. హత్యకు గురైన మహిళ, ఆమె కుమారుడి మృతదేహాలు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఈ ఘటన వైజాగ్‌ శివార్లలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ మదీనాబాగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలోని బ్లాక్ నంబర్ 3లో నివాసముంటున్న మంగి గౌరమ్మ (55) ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గౌరమ్మ తన రెండో కుమారుడితో.. మదీనాబాగ్ మద్యం షాపు దగ్గర ఆహార పదార్థాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె రెండో కుమారుడు పోలారెడ్డి (35), మూడో కుమారుడు ఒకే బ్లాక్‌లోని వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. పోలారెడ్డికి పెళ్లి కాలేదు. అతను తన తల్లికి సహాయం చేసేవాడు.

తెలిసిన వివరాల ప్రకారం.. ముగ్గురు నిందితులు గౌరమ్మ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టారు. ఆ శబ్దం విని పోలారెడ్డి తన ఫ్లాట్ తలుపు తెరిచాడు. అదే సమయంలో గౌరమ్మ కూడా తలుపు తీసింది. ఈ క్రమంలోనే ఓ నిందితుడు పోలారెడ్డిని, అతని తల్లి ఈడ్చుకెళ్లాడు. గౌరమ్మ గొంతు నులిమి హత్య చేశారు. ఆమె కుమారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలారెడ్డిని కూడా చేతులు, కాళ్లు బిగించి నోటికి గుడ్డతో బిగించి హత్య చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తల్లీ, కొడుకుల ఫ్లాట్ల నేలపై కారం పొడి చల్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో కారంపొడి టిన్నును పోలీసులు గుర్తించారు. బాధితురాలి కోడలుతో పాటు మరికొందరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Next Story