దారుణం..డబ్బుల బాకీ వివాదంతో సొంత అన్నను చంపిన సోదరులు
కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By - Knakam Karthik |
దారుణం..డబ్బుల బాకీ వివాదంతో సొంత అన్నను చంపిన సోదరులు
కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇచ్చిన అప్పు రూ. 20 లక్షలు తిరిగి ఇవ్వాలని కోరిన సొంత అన్నను చంపిన బద్వేలులో జరిగింది. బద్వేలు రూరల్ పిఎస్ పరిధిలో జరిగిన మిస్టరీ హత్య కేసును బద్వేలు రూరల్ పోలీసులు చేదించారని కడప జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాధ్ తెలిపారు.
ఈ నెల 11 వ తేదీన బద్వేలు గోపవరం మండలం సత్య సాయి టౌన్ షిప్ వద్ద హత్యకు గురైన చిన్న గురయ్య, గాయపడిన మూడే పెద్ద గురయ్యల కేసులో సొంత సోదరులే ప్రధాన నిందితులని, నిందితులు మూడే చిన్న గురవయ్య, మూడే నడిపి గురయ్య లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం లో తెలిపారు.
అప్పుకు సంబందించిన పత్రాలను లాక్కుని, పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న సుత్తులతో మృతుడి వెనుక భాగం లో విచక్షణ రహితంగా కొట్టి చిన్న గురయ్య ను హత్య చేసారని, అడ్డువచ్చిన పెద్దన్న పెద్ద గురయ్య పై కూడా హత్యాయత్నం చేసి గాయపరిచారన్నారు.