రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని తన హోటల్ గదిలో బుధవారం ఉదయం బ్రిటిష్ మహిళ శవమై కనిపించింది. వెంటనే ఆమెను నగరంలోని సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. మృతురాలిని 53 ఏళ్ల సమంతగా గుర్తించారు. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపురా హవేలీలోని రూం నంబర్ 325లో ఆమె ఉంటోంది. ప్రస్తుతం మహిళ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మహిళ మృతిపై పోలీసులు బ్రిటిష్ ఎంబసీకి సమాచారం అందించారు.
ఆమె కుటుంబం భారతదేశానికి వచ్చిన తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. గుండెపోటుతో మహిళ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మహిళ మృతిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ముందుగా గుర్తించిన హోటల్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మహిళ మృతిపై ఎస్‌ఎంఎస్ ఆస్పత్రి విభాగం పోలీసులకు సమాచారం అందించింది.