ఫస్ట్‌నైట్ రోజు భర్తకు షాకిచ్చిన భార్య.. పాలలో మత్తుమందు కలిపి.. ఆపై..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఫస్ట్‌నైట్‌ రోజు తన భర్తకు భార్య షాక్‌ ఇచ్చింది. భర్తకు మత్తు మందు కలిపిన పాలను తాగించిన భార్య.. ఆ తర్వాత 12 లక్షల రూపాయల విలువైన వస్తువులను తీసుకుని పారిపోయింది.

By అంజి  Published on  17 Dec 2024 6:30 AM GMT
Bride, drug, groom, milk, wedding night, Crime

ఫస్ట్‌నైట్ రోజు భర్తకు షాకిచ్చిన భార్య.. పాలలో మత్తుమందు కలిపి.. ఆపై..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఫస్ట్‌నైట్‌ రోజు తన భర్తకు భార్య షాక్‌ ఇచ్చింది. భర్తకు మత్తు మందు కలిపిన పాలను తాగించిన భార్య.. ఆ తర్వాత 12 లక్షల రూపాయల విలువైన వస్తువులను తీసుకుని పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరుడు రాజ్‌దీప్ రావత్, మధ్యప్రదేశ్‌లోని చరఖారీకి చెందిన ఖుషీ తివారీని డిసెంబర్ 13న మధ్యవర్తి సుకన్ పాఠక్ ఏర్పాటు చేసిన హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫస్ట్‌ నైట్‌ రోజు రాత్రి వధువు రాజ్‌దీప్‌కు మత్తుమందు కలిపిన పాలను ఇచ్చింది. అతను అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత.. ఆమె సుమారు రూ. 12 లక్షల బంగారు నగలు, వెండి ఆభరణాలు, వరుడి మొబైల్ ఫోన్‌తో పారిపోయింది. రాజ్‌దీప్‌కి స్పృహ వచ్చాక, తాను మోసపోయినట్టు గ్రహించాడు.

చరఖారీ నివాసిగా కుటుంబానికి పరిచయమైన వధువు.. పక్కా ప్లాన్‌తో ఈ పెళ్లి చేసుకుందని వరుడి కుటుంబ సభ్యులు గ్రహించారు. వెంటనే బాధితుడి తండ్రి వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఖుషీ తివారీ, తన సహచరులతో కలిసి ఇలాంటి మోసపూరిత వివాహాల్లో పలువురు యువకులను మోసగించి ఉండవచ్చని తెలుస్తోంది. కుటుంబీకులు తమ ఆస్తులను స్వాధీనం చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story