దారుణం.. పాఠశాల విద్యార్థినిపై యాసిడ్‌ దాడి

Boy Throws Acid on Schoolgirl in Dwarka.పాఠ‌శాల‌కు వెలుతున్న బాలిక‌పై బాలుడు యాసిడ్ దాడికి పాల్ప‌డ్డాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2022 12:16 PM IST
దారుణం.. పాఠశాల విద్యార్థినిపై యాసిడ్‌ దాడి

పాఠ‌శాల‌కు వెలుతున్న బాలిక‌పై బాలుడు యాసిడ్ దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

ద్వారకా జిల్లా పీఎస్ మోహన్ గార్డెన్ ప్రాంతంలో ఉద‌యం 7.30 గంట‌ల‌కు ఓ బాలిక పాఠ‌శాలకు న‌డుచుకుంటూ వెలుతుండ‌గా బైక్ వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు బాలిక‌పై యాసిడ్ పోసి ప‌రారు అయ్యారు. వెంట‌నే స్పందించిన స్థానికులు బాలిక‌ను సఫ్దర్‌జంగ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఆస్ప‌త్రికి చేరుకున్నారు. బాలిక నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం బాలిక ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 గంటలకు పిసిఆర్ కాల్ వచ్చింది. ఉదయం బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికపై యాసిడ్ లాంటి పదార్థాన్ని ఉపయోగించి దాడి చేశారని చెప్పారు. ఘటన జరిగిన సమయంలో బాలిక తన చెల్లెలితో కలిసి ఉంది. ఇద్ద‌రిపై అనుమానం వ్య‌క్తం చేయ‌గా.. ఒక‌రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Next Story