బ‌ర్త్‌డే వేడుక‌ల్లో సెల్ఫీ.. బెదిరించి ప‌లుమార్లు అత్యాచారం

Boy molested Girl By Threatening To Circulate Their Kiss Selfie.పుట్టిన రోజు వేడుక‌ల్లో బాలిక‌ను ఆమె స్నేహితుడు ముద్దు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2022 8:16 AM IST
బ‌ర్త్‌డే వేడుక‌ల్లో సెల్ఫీ.. బెదిరించి ప‌లుమార్లు అత్యాచారం

పుట్టిన రోజు వేడుక‌ల్లో బాలిక‌ను ఆమె స్నేహితుడు ముద్దు పెట్టుకున్నాడు. దీనిని సెల్ఫీ తీసుకున్నాడు. త‌న కోరిక తీర్చ‌క‌పోతే ఆ ఫోటోను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తాన‌ని బెదిరించి ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న ముంబైలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. అక్టోబ‌ర్ 10న ముంబై బాంద్రాలోని కార్టర్ రోడ్డు ఏరియాలో 17 ఏళ్ల బాలిక త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకుంది. ఆ వేడుక‌ల్లో ఆమె స్నేహితుడు కూడా పాల్గొన్నాడు. ఆ స‌మ‌యంలో బాలిక‌ను ముద్దు పెట్టుకుంటూ అత‌డు సెల్ఫీ దిగాడు. ఆ త‌రువాత అత‌డు త‌న‌ నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

త‌న కోరిక తీర్చాల‌ని లేదంటే ఈ ఫోటోను సోష‌ల్ మీడియాలో పెడుతాన‌ని బెదిరించి అక్టోబ‌ర్ 10 నుంచి న‌వంబ‌ర్ 26 వ‌ర‌కు ప‌లుమార్లు బాలిక‌పై అత్యాచారం చేశాడు. ఇటీవ‌ల బాలిక చ‌దువుకుంటున్న కాలేజీ వ‌ద్ద‌కు వెళ్లాడు. త‌న‌తో రావాల‌ని బాలిక‌ను బ‌ల‌వంతం చేశాడు. ఇందుకు బాలిక నిరాక‌రించింది. దీంతో బాలిక‌పై దాడి చేశాడు. బాలిక స్నేహితురాలు ఈ విష‌యాన్ని ఆమె త‌ల్లిదండ్రులు చెప్పింది. ఏం జ‌రిగింద‌ని వారు ఆరా తీయ‌గా అస‌లు విష‌యాన్ని మొత్తం చెప్పింది.

అనంత‌రం బాధితురాలు బంధువుల‌తో క‌లిసి ఖేర్వాడి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే.. సంఘటన ఖార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కార్టర్ రోడ్‌లో జరిగినందున ఈ కేసును ఖార్ పోలీస్ స్టేషన్ బ‌దిలీ చేసిన‌ట్లు స్టేష‌న్ అధికారి తెలిపారు. పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Next Story