స‌ర‌దాగా ర‌మ్మంటే.. వచ్చాడు.. చంపేశాడు

Boy friend killed his Married girl friend.వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. అయితే.. వారి ప్రేమ‌కు త‌ల్లిదండ్రులు అడ్డు చెప్పారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2021 4:57 AM GMT
స‌ర‌దాగా ర‌మ్మంటే.. వచ్చాడు.. చంపేశాడు

వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. అయితే.. వారి ప్రేమ‌కు త‌ల్లిదండ్రులు అడ్డు చెప్పారు. ప్రియురాలు మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. ప్రియురాలిని క‌లిసేందుకు వంద‌ల కిలోమీట‌ర్ల దూరం నుంచి వ‌చ్చాడు. పెళ్లైన ప్రియురాలిని తనతో రావాలని కోరగా ఆమె అందుకు నిరాకరించింది. దీంతో త‌న స్నేహితుడి సాయంతో దారుణంగా హ‌త మార్చాడు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం రాత్రి జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ఝూర్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన పూజ (21), రాజేశ్‌ వర్మకి మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి అనంతరం హైదరాబాద్ నగరానికి వచ్చి జీడిమెట్ల వినాయక్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజేశ్ వ‌ర్మ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు సంస్థ‌లో ప‌నిచేస్తున్నాడు. భ‌ర్త ఆఫీసుకు వెళ్లిన త‌రువాత పూజ.. తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేది. నిన్ను చూడాలని ఉంది. హైదరాబాద్‌కు వస్తావా? అంటూ అడిగింది. వెంట‌నే అత‌డు త‌న స్నేహితుడిని వెంట‌బెట్టుకుని 24 గంట‌ల్లో వ‌చ్చాడు.

అనంతరం తన వెంట రావాలని ఇద్దరం కలిసుందామని ప్రియుడు.. ప్రియురాలిని కోరాడు. త‌న‌కు వివాహం అయ్యింద‌ని.. నీతో రాలేన‌ని చెప్పింది. దీంతో ఆగ్ర‌హించిన ప్రియుడు.. పూజ‌ను దిండు సాయంతో ఊపిరాడ‌కుండా చేసి హ‌త‌మార్చాడు. అనంతరం నిందితులిద్దరూ మృతురాలి మంగళసూత్రం, బంగారు చైన్ లతో పరారయ్యారు. హ‌త్య‌పై భ‌ర్త రాజేశ్ వ‌ర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it