Hyderabad: చాక్లెట్ల ఆశ చూపి చిన్నారులపై లైంగిక వేధింపులు.. స్థానికులు దుకాణంపై దాడి

బోరబండలో ఓ షాపు యజమాని అబ్దుల్ రవూఫ్ (53) అనే వ్యక్తి మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది.

By అంజి  Published on  22 Sep 2023 3:19 AM GMT
Borabanda, Hyderabad, Crime news

Hyderabad: చాకెట్ల ఆశ చూపి చిన్నారులపై లైంగిక వేధింపులు.. స్థానికులు దుకాణంపై దాడి

హైదరాబాద్: బోరబండలో గురువారం అర్థరాత్రి ఓ షాపు యజమాని అబ్దుల్ రవూఫ్ (53) అనే వ్యక్తి మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బోరబండ మార్కెట్‌లో రవూఫ్ చిన్న దుకాణాన్ని నడుపుతున్నాడు. నివేదికల ప్రకారం.. గురువారం సాయంత్రం వేరొక కమ్యూనిటీకి చెందిన ఒక మైనర్ బాలుడు అతని దుకాణానికి వెళ్లాడు. అక్కడ రవూఫ్ అనుచితంగా ప్రవర్తించాడు. బాలుడిని లైంగికంగా వేధించాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. అతని తల్లిదండ్రులు, స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. ఆ తర్వాత ఆగ్రహించిన స్థానికులు అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు.

ఈ సంఘటనపై స్పందించి, మతపరమైన మలుపు తీసుకోకుండా నిరోధించడానికి, ఆ ప్రాంతంలో పోలీసు సిబ్బందిని మోహరించారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బోరబండ పరిధిలోని బ్రాహ్మణవాడలో నివాసముంటున్న రవూఫ్‌.. చిన్న పిల్లలకు చాక్లెట్ల ఆశ చూపి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిసింది. రవూఫ్‌.. ఓ పార్టీకి చెందిన స్థానిక లీడరైన రవూఫ్‌.. బస్తీలో చిన్న కిరాణం షాప్ నడిపిస్తూ షాపుకు వచ్చే చిన్నపిల్లలను శారీరకంగా ఇబ్బంది గురిచేస్తున్నాడు. కాగా తాజాగా మైనర్‌ బాలుడి తల్లితండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Next Story